remond
-
ఫోన్ ట్యాపింగ్ కేసు: రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు
తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అటు రాజకీయంగానూ తీవ్ర దమారం రేపుతోంది. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్తోపాటు బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరదీసింది.తాజాగా ట్యాపింగ్ కేసులో A4గా ఉన్న రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు వెలుగుచూశాయి. 2018 ఎన్నికలు, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికలు, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు తరలించినట్లు పోలీసుల ఎదుట అంగీకరించారు. 8 సార్లు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తరలించినట్లు ఒప్పుకున్నారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలు మేరకు ఎన్నికల సమయంలో ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు వెల్లడించారు.బీఆర్ఎస్ గెలుపు కోసం కొందరు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు రాధాకిషన్ రావు తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌లోని సిబ్బందిని బెదిరించి బీఆర్ఎస్ పార్టీకి చెందిన డబ్బులను సరఫరా చేసినట్లు అంగీకరించారు. టాస్క్‌ఫోర్స్ బృందానికి వాహనాలు సమకూర్చినట్లు ఒప్పుకున్నారు. ఓ ఎమ్మెల్సీ చిన్ననాటి స్నేహితుడు కావడంతో అతడి డబ్బులు తరలించినట్లు పేర్కొన్నారు. 2023లో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన ఇన్స్పెక్టర్లు, సిబ్బంది డబ్బుల పట్టుకోవడంలో కీలక పాత్ర వహించినట్లు వెల్లడించారు. 8 సార్లు పట్టుకున్న డబ్బు మొత్తం ప్రతిపక్షాలకు చెందినదేనని చెప్పారు.ఫోన్ ట్యాపింగ్ ద్వారా 2018లో శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్య సిమెంట్ ఆనంద్ ప్రసాద్ నగదు ప్యారడైజ్ వద్ద 70 లక్షలు సీజ్ చేసినట్లు తెలిపారు. 2020 దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో రఘునంధన్ రావు, ఆయన బందువుల నుంచి కోటి రూపాయలు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ముడుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహచరుల నుంచిరూ.3.50 కోట్ల స్వాధీనం చేసుకున్నామని రాధకిషన్ రావు చెప్పినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.చదవండి: కేసీఆర్‌కు భట్టి విక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్ -
ప్రీతి ఆత్మహత్య కేసు.. సైఫ్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడైన సైఫ్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సైఫ్ ఫోన్లో 17 వాట్సాప్ చాట్స్‌ను పోలీసులు పరిశీలించారు. అనుషా, భార్గవ్, ఎల్డీడీ+నాక్ అవుట్స్(LDD+knockout) గ్రూప్ చాట్స్ స్వాధీనం చేసుకున్నారు. అనస్థీషియా విభాగంలో ప్రీతి సుపర్ వైజర్‌గా సైఫ్ ఉండేవాడని.. రెండు ఘటనల ఆధారంగా ఆమెపై కోపం పెంచుకున్నట్లు రిమాండ్ రిపోర్టు ద్వారా వెల్లడైంది. డిసెంబర్లో ఓ యాక్సిడెంట్ కేసులో ప్రీతిని సైఫ్ గైడ్ చేసినట్లు తెలిసింది. ఆ ఘటనలో ప్రీతి ప్రిలిమినరీ అనస్థీషియా రిపోర్టు రాయగా.. ఆమె రాసిన రిపోర్టును వాట్సాప్ గ్రూపుల్లో హేళన చేశాడు. రిజర్వేషన్లో ఫ్రీ సీట్ వచ్చిందంటూ అవమానించాడు. తనతో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే హెచ్ఓడీకి చెప్పాలని ప్రీతి.. సైఫ్‌కు వార్నింగ్ ఇచ్చింది. దీంతో ప్రీతిని వేధించాలని సైఫ్.. భార్గవ్‌కు చెప్పాడు. ఆర్ఐసీయూలో రెస్ట్ లేకుండా ప్రీతికి డ్యూటీ వేయాలని చెప్పాడు. దీంతో గత నెల 21న హెచ్ఓడీ నాగార్జునకు ప్రీతి ఫిర్యాదు చేసింది. డాక్టర్లు మురళి, శ్రీకళ, ప్రియదర్శిని సమక్షంలోప్రీతి సైఫ్‌లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మరుసటి రోజే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడింది’ అని సైఫ్ రిమాండ్ రిపోర్టులో తేలింది. కాగా, సీనియర్ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయిదు రోజులు మృత్యువుతో పోరాడి కన్నుమూసింది. మరోవైపు నిందితుడు మెడికల్ పీజీ సీనియర్ విద్యార్థి సైఫ్‌పై వరంగల్ మట్టెవాడ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అతడిని ఈ నెల 24న అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి అతడికి 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఖమ్మం జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. మరోవైపు సైఫ్‌ను ఎంజీఎం ఆస్పత్రి విధుల నుంచి సస్పెండ్ చేశారు. నేరం రుజువైతే మెడికల్ కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తామని ప్రకటించారు. -
నవీన్ హత్య కేసు.. ‘సాక్షి’ చేతిలో నిందితుడు హరిహరకృష్ణ రిమాండ్ రిపోర్టు
సాక్షి, హైదరాబాద్: బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు నిందితుడు రిమాండ్ రిపోర్టు సాక్షి చేతికి అందింది. హరిహరకృష్ణ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూడు నెలల క్రితమే నవీన్ హత్యకు హరిహరకృష్ణ ప్లాన్ వేసినట్లు తేలింది. గెట్ టు గెదర్ పేరుతో జవరి 16న హత్యకు కుట్ర చేయగా.. వీలు కాకపోవడంతో ఫిబ్రవరి 17న హత్య చేసినట్లు వెల్లడైంది. బ్రహ్మణపల్లిలోని స్నేహితుడు హసన్‌కు నవీన్ హత్య గురించి చెప్పి, అతని ఇంట్లోనే నిందితుడు హరిహరకృష్ణ గడిపినట్లు రిమాండ్ రిపోర్టు ద్వారా తెలిసింది. అంతేగాక ప్రియురాలిని కలిసి నవీన్ హత్య గురించి తెలపగా.. పోలీసులకు లొంగిపోవాలని ఆమె చెప్పినా వినకుండా వరంగల్ వెళ్లినట్లు వెల్లడైంది. రిమాండ్ రిపోర్టు ప్రకారం..ఈ నెల 17వ తేదీన రాత్రి 9 గంటలకు పెద్దంబర్‌పేట్ తిరుమల వైన్స్ వద్ద నవీన్, హరిహర కృష్ణ మద్యం సేవించారు. ఎల్బీనగర్, నాగోల్, ముసారంబాగ్, సైదాబాద్, చైతన్యపురి, కొత్తపేట పప్రాంతాల్లో నవీన్‌తో కలిసి తిరిగాడు. రాత్రి 12 గంటలకు యువతి ప్రేమ వ్యవహారంలో పరస్పరం వాగ్వాదం జరిగింది. తొలుత గొంతు నులిమి నవీన్‌ను హత్య చేసిన హరిహరకృష్ణ.. అనంతరం కత్తితో నవీన్ శరీర భాగాలను వేరుచేశాడు. బ్యాగ్‌లో తలతో సహా శరీర విడిభాగాలను తీసుకెళ్లాడు. ఫోన్ హైదరాబాద్ నివాసంలో ఉంచిన నిందితుడు.. కోదాడ, ఖమ్మం, వైజాగ్‌లో రెండు రోజులు గడిపాడు. ఈనెల 23న తిరిగి వరంగల్ చేరుకొని తండ్రికి నవీన్ హత్య గురించి చెప్పాడు. ఈనెల 24న తిరిగి బ్రహ్మణపల్లి హత్యా స్థలంలోనవీన్ శరీర భాగాలతోపాటు ఆధారాలను తగలబెట్టిన హరిహరకృష్ణ.. అనంతరం అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు లొంగిపోయాడు. కాగా హరిహరకృష్ణకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో అతన్ని చర్లపల్లి జైలుకు తరలించారు. -
ఇరుపక్షాల వాదనలు పూర్తి, 1.30కి ఉత్తర్వులు
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ఇరుపక్షాల వాదనలను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి విన్నారు. దీనిపై మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ఈ కేసులో అయిదో నిందితుడిగా ఉన్న సండ్ర తన వాదనలు కోర్టుకు వినిపించారు. 'నా పిల్లలు విశాఖపట్నంలో చదువుకుంటున్నారు కాబట్టి మార్గమధ్యలో రాజమండ్రిలో చికిత్స పొందాను. నేను సత్తుపల్లి ఎమ్మెల్యేను కాబట్టి ఏసీబీ ...నా క్వార్టర్స్‌లో నోటీసు ఇచ్చిన విషయం తెలియదు. మీడియా ద్వారా విషయం తెలుసుకుని ఏసీబీకి లేఖ రాశాను. ఏసీబీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ తర్వాత విచారణకు సిద్ధంగా ఉన్నానని రెండోసారి నేనే లేఖ రాశాను. రెండోసారి నోటీసులిచ్చిన సమయానికి విచారణకు హాజరయ్యాను. నిన్న 8 గంటల పాటు ఏసీబీ అధికారులు విచారించారు. ఏసీబీ విచారణలో నాకు తెలిసిన అన్ని విషయాలు వెల్లడించా' అని తెలిపారు. ఎమ్మెల్యే సండ్రను నిన్న అరెస్ట్ చేసిన అధికారులు ఇవాళ ఏసీబీ కోర్టులు హాజరు పరిచారు. ఆయనను అయిదు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని అధికారులు పిటిషన్ వేశారు.