ఖమ్మం సిటీ : జిల్లాలో పోలవరం ముంపు మం డలాలను ఆంధ్రలో కలపుతూ తీసుకున్న నిర్ణ యం గత యూపీఏ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు. గిరిజనులను ముం చుతున్న పాపం కాంగ్రెస్‌దే అని వ్యాఖ్యానించా రు. ఖమ్మంలోని టీడీపీ జిల్లా కార్యాయలంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారుమాట్లాడారు.తెలంగాణ ఇచ్చే ముం దు అప్పటి యూపీఏ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తూ ముంపు గ్రామాలను ఆంధ్రలో కలపాలనే నిర్ణయం తీసుకుందన్నారు. గిరిజనులకు ద్రోహం చేసిన కాంగ్రెస్‌కు ఆర్డినెన్స్ ఆమోదం తర్వాత ఆందోళనలు చేపట్టే హక్కులేదని వ్యాఖ్యానించారు.
పోలవరం ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 2004 నుంచి భూసేకరణ చేపట్టిందని, నిర్వాసితులకు ఆంధ్రలో ఎకరాకు రూ. 3లక్షలు చెల్లించగా తెలంగాణలో రూ.లక్ష 20 వేలు మాత్రమే చెల్లించి 45 వేల ఎకరాలను స్వాధీనం చేసుకుందని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం కాకుండా వాస్తవిక దృక్పథంతో ఆలోచించి జిల్లాలోని గిరిజన సంస్కృతీ సంప్రదాయలను కాపాడలన్నారు. ఇప్పటికైనా కమిషన్‌ను నియమించి గిరిజనుల అభిప్రాయాలను సేకరించాలన్నారు. ప్రాజెక్టు డిజైన్ మార్చాలని, ఇందుకు సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలని అన్నారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు కేతినేని హరిష్‌చంద్రా, రాయిపూడి జయకర్, హన్మంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆర్డినెన్స్ పాపం కాంగ్రెస్‌దే..
Published Mon, Jul 14 2014 1:33 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement