సండ్రకు మళ్లీ ఏసీబీ నోటీసులు | Again send ACB notices to Sandra venkata veeraiah | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 5 2015 6:56 AM | Last Updated on Fri, Mar 22 2024 10:59 AM

‘ఓటుకు కోట్లు’ కేసులో ఏసీబీ అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడొస్తానంటూ లేఖ రాయడంతోపాటు రెండు, మూడు రోజులుగా బహిరంగంగా ప్రకటనలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు శనివారం మరోసారి పిలుపు వచ్చింది. సోమవారం లోగా తమ ఎదుట హాజరు కావాలంటూ ఏసీబీ అధికారులు హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉన్న సండ్ర నివాసానికి నోటీసులు అతికించారు. అయితే ఈసారి సండ్రకు సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులిచ్చారు. ఇంతకు ముందు జూన్16న సండ్రకు ఏసీబీ సీఆర్‌పీసీ సెక్షన్ 160 (సాక్షిగా) ప్రకారం నోటీసులు జారీ చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement