తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ బలోపేతంపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చర్చించినట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ బలోపేతంపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చర్చించినట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. సోమవారం తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఆయనతో భేటీ అనంతరం సండ్ర మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో టీడీపీ బలోపేతం,ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధానంగా చర్చించామన్నారు. ఈ నెల 4 వ తేదీన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నారు. ఐదో తేదీన ఖమ్మం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శిస్తామన్నారు. ఈ రోజు తెలంగాణ సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరామన్నారు.
నాగార్జున సాగర్ ఎడమ కాలువ క్రింద ఏడు లక్షల ఎకరాలకు రెండో పంటకు నీరు.. మిగిలిన జిల్లాల్లో రెండవ పంటకు కరెంటు ఇవ్వాలని సీఎంను కోరతామన్నారు.