తమ పార్టీకి చెందిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అరెస్టును తెలుగు దేశం పార్టీ నాయకులు ఖండించారు. కేసీఆర్ ప్రభుత్వం అన్యాయంగా టీడీపీ నాయకులను కేసుల్లో ఇరికిస్తోందని అన్నారు. అసలు ఈ కేసుతో సండ్ర వెంకట వీరయ్యకు సంబంధం లేకపోయినా ఆయనపై ఉద్దేశపూర్వకంగానే కేసు పెట్టారని ఆరోపించారు.
సండ్ర వెంకట వీరయ్యను సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి సుమారు 7 గంటల పాటు విచారించిన తర్వాత ఏసీబీ వర్గాలు ఆయనను అరెస్టు చేశాయి. ఆయన అరెస్టు విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశారు.
'అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తున్నారు'
Published Mon, Jul 6 2015 7:12 PM | Last Updated on Sat, Aug 11 2018 2:53 PM
Advertisement
Advertisement