గవర్నర్ విందుకు కేసీఆర్ దూరం! | kcr likely to avoid governor's tea party in rajbhavan | Sakshi
Sakshi News home page

గవర్నర్ విందుకు కేసీఆర్ దూరం!

Published Tue, Jun 30 2015 7:10 PM | Last Updated on Mon, Jul 29 2019 6:58 PM

గవర్నర్ విందుకు కేసీఆర్ దూరం! - Sakshi

గవర్నర్ విందుకు కేసీఆర్ దూరం!

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇస్తున్న విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దూరంగా ఉంటున్నారు. గత వారంలో నాలుగు రోజుల పాటు ఫాంహౌస్లోనే గడిపిన కేసీఆర్.. జ్వరంతో బాధపడుతున్నారని సీఎం కార్యాలయ వర్గాలు సోమవారమే తెలిపాయి. దాంతో ఆయన మంగళవారం నాడు అన్ని అపాయింట్మెంట్లూ రద్దు చేసుకుని క్యాంపు కార్యాలయానికే పరిమితం అయ్యారు.

అయితే.. అత్యంత ముఖ్యమైన రాష్ట్రపతి గౌరవార్థం ఇస్తున్న విందుకు కూడా కేసీఆర్ హాజరు కాకపోవడానికి అనారోగ్యం ఒక కారణం అయినా.. ముఖ్యమైన మరో కారణం ఉందని కూడా నేతలు అంటున్నారు. ఈ విందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు హాజరవుతున్నారు. ఓటుకు కోట్లు కేసు బయటపడినప్పటి నుంచి ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. త్వరలోనే చంద్రబాబుకు కూడా నోటీసులు ఇచ్చేందుకు తెలంగాణ ఏసీబీ సిద్ధమైనట్లు కథనాలు వస్తున్న నేపథ్యంలో.. ఈ పరిస్థితుల్లో చంద్రబాబును కలవడం ఇష్టం లేకపోవడం వల్లే ఇంత ముఖ్యమైన విందుకు కూడా కేసీఆర్ దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement