టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విడుదలకు రూట్ క్లియర్ అయింది. బెయిల్ ఆర్డర్లో సాంకేతిక లోపాలు ఉండటంతో బుధవారం ఉదయం రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు హైకోర్టులో కరెక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారించిన హైకోర్టు పూచీకత్తు ఏసీబీ కోర్టులోనే ఇవ్వాలని స్పష్టం చేసింది. తీర్పు కాపీని హైకోర్టు సవరించింది. మరికాసేపట్లో కాపీ ప్రతి ఏసీబీ కోర్టుకు అందనుంది. దాంతో రేవంత్ రెడ్డి ఇవాళ చర్లపల్లి జైలు నుంచి విడుదల కానున్నారు.