
ఎక్సైజ్ పోలీసుల కస్టడీకి ఉదయసింహా
ఓటుకు కోట్లు కేసులో ఎ3 నిందితుడు ఉదయసింహాను సరూర్నగర్ ఎక్సైజ్ పోలీసులు రెండు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు.
ఓటుకు కోట్లు కేసులో ఎ3 నిందితుడు ఉదయసింహాను సరూర్నగర్ ఎక్సైజ్ పోలీసులు రెండు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. గతంలో దాడులు జరిపినప్పుడు ఉదయసింహా ఇంట్లో విదేశీ మద్యం బాటిళ్లు దొరకడంతో.. ఆ కేసులోనే ఇప్పుడు ఎక్సైజ్ పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. ఉదయసింహాపై 34 ఎ ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
ఉదయసింహ ఇంట్లో 5 విదేశీ మద్యం, రెండు డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఏఎస్పీ రవీంద్రరావు తెలిపారు. మద్యం బాటిళ్లను ఢిల్లీలో తీసుకున్నారని, వీటికి అనుమతి లేదని ఆయన వివరించారు. ఇంకా ఎవరెవరికి మద్యం బాటిళ్లు ఇచ్చారో తెలుసుకోవాల్సి ఉందని రవీంద్రరావు చెప్పారు.