పాతబస్తీలో పేరు మోసిన గుడుంబా డాన్ నేతుల లలిత (40)పై పీడీ యాక్ట్ నమోదు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించామని చార్మినార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.
గత కొంతకాలంగా పాతబస్తీలోని భయ్యాలాల్‌నగర్, లలితాబాగ్, ఉప్పుగూడ తదితర ప్రాంతాల్లో అక్రమ గుడుంబా వ్యాపారం కొనసాగిస్తూ స్థానిక ప్రజల అనారోగ్యాలకు కారణమవుతున్నందన ఆమెను అదుపులోకి తీసుకున్నామన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ పర్యవేక్షణలో నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. పాతబస్తీ లలితాబాగ్ ప్రాంతానికి చెందిన నేతుల లలితపై చార్మినార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 61 కేసులు నమోదయ్యాయన్నారు.