
చంద్రబాబుతో జిమ్మిబాబు(ఫైల్)
హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఏసీబీ అధికారులు ఎమ్మెల్యే సండ్రతో పాటు తెలుగు యువత రాష్ట్ర నాయకుడు జిమ్మిబాబు అనే వ్యక్తికీ నోటీసులు జారీ చేసింది. జిమ్మిబాబు కూడా సోమవారం సాయంత్రం లోగా తమ ఎదుట హాజరు కావాలని ఏసీబీ అల్టిమేటం జారీచేసింది. ఏసీబీ కోర్టుకు ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ ఇచ్చిన వాంగ్మూలం ద్వారా జిమ్మిబాబు పేరు తెరపైకి వచ్చింది.
'సెబాస్టియన్‌ను పరిచయం చేసింది జిమ్మిబాబు' అని స్టీఫెన్‌సన్ కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50లక్షలు ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ముగ్గురిని ఏసీబీ విచారించగా.. జిమ్మిబాబు పాత్ర వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జిమ్మిబాబును కూడా ఏసీబీ పిలిచినట్లు సమాచారం.
ఎవరీ జిమ్మిబాబు
జిమ్మిబాబు స్వస్థలం కరీంనగర్ జిల్లా గోదావరిఖని. తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆ విధంగా రేవంత్కు పరిచయమై ఆయనకు అనుచరుడుగా మారాడు. దాంతో పాటుగా జిమ్మిబాబు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కో ఆర్డినేటర్గా కొనసాగుతున్నారు. దాంతో స్టీఫెన్ సన్ కుమారుడుతో జిమ్మిబాబుకు పరిచయాలు ఉన్నాయి.
స్టీఫెన్ సన్ కుమారుడు ద్వారానే రేవంత్, స్టీఫెన్ సన్లు పరిచయం అయ్యారు. రేవంత్కు, స్టీఫెన్ సన్ను పరిచయం చేసింది జిమ్మిబాబే. తాజాగా ఆయన పేరు కూడా వెలుగులోకి వచ్చింది. సోమవారంలోగా విచారణకు హాజరు కావాలని ఏసీబీ జిమ్మిబాబుకు శనివారం నోటీసులు పంపించిన విషయం తెలిసిందే.