
'చంద్రబాబు కన్నంలో పడ్డ దొంగలా దొరికాడు'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఓటుకు కోట్లు కేసులో కన్నంలో పడ్డ దొంగలా దొరికి పోయాడని సీపీఎం సీనియర్ నేత బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. అవినీతి కేసు బయట పడేందుకు చంద్రబాబు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ఇదే అదునుగా ఓటుకు కోట్లు వ్యవహారాన్ని రాజకీయంగా ఉపయోగించాలని తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు భావిస్తున్నారని రాఘవులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఓటుకు కోట్లు కేసులో కేంద్ర ప్రభుత్వం.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను తన అదుపులో ఉంచుకోవాలని చూస్తోందని ఆయన అన్నారు.