
'ఓటుకు కోట్లు కేసుతో సంబంధం లేదు'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు యువత రాష్ట్ర నాయకుడు జిమ్మిబాబుపై చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్ సీఏ) తెలిపింది. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని హెచ్ సీఏ స్పష్టం చేసింది.
జిమ్మిబాబు సోమవారం సాయంత్రంలోగా తమ ఎదుట హాజరు కావాలని ఏసీబీ అల్టిమేటం జారీచేసిన నేపథ్యంలో హెచ్ సీఏ స్పందించింది. కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన జిమ్మిబాబు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కో ఆర్డినేటర్గా ఉన్నారు.