ఏసీబీ ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరుకావాలని 'ఓటుకు కోట్లు' కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణకు ఏసీబీకి సహకరించాలని సూచించారు. రేవంత్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ. 5 లక్షల పూచీకత్తు, ఇద్దరు వ్యక్తులతో ష్యూరిటీ సమర్పించాలని, పాస్ పోర్టును సరెండర్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.