దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ఎన్నికల సంఘం చేతికి డాక్యుమెంట్లు అందాయి. ప్రిన్సిపల్ కోర్టు అనుమతితో ఎన్నికల సంఘం ఈ డాక్యుమెంట్లను పొందింది. అంతకుముందు ఈ పత్రాలు కావాలని ఏసీబీ కోర్టులో ఎన్నికల సంఘం ఒక మెమో దాఖలుచేసింది. అయితే, మెమోలు సరిగా ఇవ్వలేదని.. ఇప్పుడు ఆ పత్రాలు ఇవ్వడం సాధ్యం కాదని ఏసీబీ కోర్టు కొట్టేసింది. దాంతో ప్రిన్సిపల్ కోర్టును ఆశ్రయించిన ఎన్నికల సంఘం.. తమకు మొత్తం అన్ని నివేదికలు కావాలని కోరింది.
ప్రిన్సిపల్ కోర్టు అనుమతితో ఇప్పుడు పత్రాలన్నీ ఎన్నికల సంఘం చేతికి వచ్చాయి. ఓటుకు కోట్లు కేసును పూర్తిగా విచారించాలని, అర్థవంతమైన ముగింపు దశకు తీసుకురావాలని కూడా ఎన్నికల సంఘం తెలంగాణ ఏసీబీకి తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నేరుగా కేసు పత్రాలను ఎన్నికల సంఘం తీసుకోవడం గమనార్హం. వాళ్లు ఈ డాక్యుమెంట్లను స్టడీ చేసిన తర్వాత ఎన్నికల చట్టాలకు సంబంధించిన కేసు కూడా పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈసీ చేతికి 'ఓటుకు కోట్లు' డాక్యుమెంట్లు
Published Fri, Jul 3 2015 6:14 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement