
'ఓటుకు కోట్లు కేసుతో మాకు సంబంధం లేదు'
ఓటుకు కోట్లు విషయంలో తమకు సంబంధం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: ఓటుకు కోట్లు విషయంలో తమకు సంబంధం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్లో ప్రస్తుతానికి సెక్షన్ -8 అమలు అవసరం లేదని ఆయన చెప్పారు. సెక్షన్ -8 అమలు చేయటం వల్ల ప్రజల మధ్య విభేదాలు, విద్వేషాలు ఏర్పడుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ, టీఆర్ఎస్ అనే రెండు పార్టీల సమస్యను రెండు రాష్ట్రాల సమస్యగా చిత్రీకరిస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.