కేసీఆర్తో ఏసీబీ డీజీ ఏకే ఖాన్ భేటీ
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఏసీబీ డీజీ ఏకే ఖాన్ గురువారం భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వారిరువురు ఓటుకు కోట్లు కేసుపై చర్చించినట్లు సమాచారం. గత నెల రోజులుగా ఈ కేసులో జరిగిన పరిణామాలు, పురోగతి, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలను ఏసీబీ డీజీ...ఈ సందర్భంగా కేసీఆర్కు వివరించినట్లు తెలుస్తోంది.
అలాగే ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి బెయిల్పై విడుదలైన అనంతరం కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. మరోవైపు రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయటాన్ని సవాల్ చేస్తూ ఏసీబీ ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది.