revanth reddy bail
-
కేసీఆర్‌తో ఏసీబీ డీజీ ఏకే ఖాన్ భేటీ
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఏసీబీ డీజీ ఏకే ఖాన్ గురువారం భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వారిరువురు ఓటుకు కోట్లు కేసుపై చర్చించినట్లు సమాచారం. గత నెల రోజులుగా ఈ కేసులో జరిగిన పరిణామాలు, పురోగతి, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలను ఏసీబీ డీజీ...ఈ సందర్భంగా కేసీఆర్‌కు వివరించినట్లు తెలుస్తోంది. అలాగే ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి బెయిల్‌పై విడుదలైన అనంతరం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. మరోవైపు రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయటాన్ని సవాల్ చేస్తూ ఏసీబీ ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. -
రేవంత్ రెడ్డి విడుదల రేపు
ఓటుకు కోట్లు కేసులో హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్న తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.. జైలు నుంచి విడుదల అయ్యేందుకు మాత్రం మరో రోజు వేచి ఉండక తప్పడం లేదు. కోర్టు రూ. 5 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు సరైన సమయంలో ష్యూరిటీలను సమర్పించకపోవడంతో ఆయనను జైలు నుంచి విడుదల చేయడంలో జాప్యం జరుగుతోంది. దర్యాప్తు అధికారుల ముందు పూచీకత్తులు, సాక్షులను ఉంచాలని హైకోర్టు తెలిపింది. ఆ తర్వాత ఏసీబీ కోర్టుకు ఏసీబీ మెమో దాఖలు చేయనుంది. ఏసీబీ మెమో ఆధారంగానే ఏసీబీ కోర్టు రేవంత్ రెడ్డి విడుదలకు ఉత్తర్వులు ఇవ్వనుంది. సాధారణంగా జైలు నుంచి ఖైదీలను సాయంత్రం 6 గంటలలోగానే విడుదల చేయాల్సి ఉంటుంది, అలాగే జైల్లోకి ఖైదీలను తీసుకురావడానికి కూడా అనుమతించరు. ఈలోపే మొత్తం లాంఛనాలన్నీ పూర్తిచేయాల్సి ఉంటుంది. అయితే, హైకోర్టు నుంచి బెయిల్ పేపర్లు ఏసీబీ కోర్టుకు చేరుకున్నా, రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు మాత్రం తగిన సమయంలో ష్యూరిటీ పేపర్లు సమర్పించలేకపోయారు. దాంతో ఆయన విడుదల మరొక్కరోజు ఆలస్యం అవుతోంది. బుధవారం నాడే రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలు నుంచి విడుదల కానున్నారు. -
బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకు ఏసీబీ!
-
న్యాయవ్యవస్థపై నమ్మకముంది: రావుల
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్‌రెడ్డికి బెయిల్ లభించడంపై ఆ పార్టీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో స్పందించారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకముందన్నారు. రేవంత్‌కు బెయిల్ లభించడంతో న్యాయమే గెలిచిందని తెలిపారు. ఓటుకు నోటు వ్యవహారం రాజకీయ కుట్రతోనే జరిగిందని తాము మొదటి నుంచి చెబుతునే ఉన్నామని రావుల చంద్రశేఖరరెడ్డి గుర్తు చేశారు. టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్‌రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంగళవారం మంజురు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి పై విధంగా స్పందించారు.