నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. మత్తయ్య వేసిన క్వాష్ పిటిషన్పై విచారణను వేరే బెంచ్కు బదిలీ చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. స్టీఫెన్సన్ వేసిన పిటిషన్ కోర్టును తప్పుదోవ పట్టించేలా ఉందని ధర్మాసనం ఈ సందర్భంగా ఘాటుగా వ్యాఖ్యానించింది. సెక్షన్-14 ప్రకారం స్టీఫెన్సన్పై ఎందుకు చర్యలు తీసుకోకూడదని హైకోర్టు బెంచ్ ప్రశ్నించింది. కోర్టు ధిక్కార అభియోగం కింద ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కాగా తనపై ఉన్న కేసులను కొట్టి వేయాలంటూ ఓటుకు కోట్లు కేసులో A-4 నిందితుడిగా ఉన్న మత్తయ్య వేసిన పిటిషన్ విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకోవాలని స్టీఫెన్సన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Published Mon, Jun 29 2015 11:24 AM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement