
సిగ్గుంటే టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిగ్గుంటే.. టీఆర్ఎస్లో చేరిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిగ్గుంటే.. టీఆర్ఎస్లో చేరిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పి కేసు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
న్యాయం తమ పక్షాన ఉంది కాబట్టే రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చిందని ఆయన అన్నారు. దమ్ముంటే తెలంగాణ అసెంబ్లీని వెంటనే సమావేశపరచాలని, అక్కడే నీ కుటుంబ అవినీతి మొత్తాన్ని బయటపెడతామని కేసీఆర్ను ఎర్రబెల్లి దయాకర్ రావు సవాలు చేశారు.