రేపు అధికారికంగా టీఆర్ఎస్ లోకి ఎర్రబెల్లి | yerrabelii dayakar rao joining to trs party on officialy | Sakshi
Sakshi News home page

రేపు అధికారికంగా టీఆర్ఎస్ లోకి ఎర్రబెల్లి

Published Wed, Feb 24 2016 3:52 AM | Last Updated on Thu, Oct 4 2018 8:29 PM

రేపు అధికారికంగా టీఆర్ఎస్ లోకి ఎర్రబెల్లి - Sakshi

రేపు అధికారికంగా టీఆర్ఎస్ లోకి ఎర్రబెల్లి

తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో చేరిక
సాక్షి, హైదరాబాద్: అధికారికంగా గులాబీ గూటిలోకి చేరేం దుకు ఎర్రబెల్లి దయాకర్‌రావు ముహూర్తం పెట్టుకున్నారు. ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించిన ఆయన గురు వారం సీఎం సమక్షంలో అధికారికంగా పార్టీలో చేరనున్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో ఎర్రబెల్లికి కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లితో పాటు ఇటీవల టీఆర్ ఎస్‌లో చేరిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, వివేకానంద, రాజేందర్‌రెడ్డి కూడా గులాబీ కండువాలు కప్పుకోనున్నారు. కాగా, ఇదే వేదికపై వరంగల్ జిల్లాలోని తన అనుచరులందరినీ ఎర్రబెల్లి టీఆర్‌ఎస్‌లోకి తీసుకురానున్నట్లు సమాచారం. ‘ఈ నెల 25న సీఎం సమక్షంలో అధికారికంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నా’ అని ఎర్రబెల్లి మంగళవారం మీడియాకు వెల్లడించారు. వాస్తవానికి ఈ నెలాఖరున నిజాం కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి చేరికల కార్యక్రమం నిర్వహించాలని భావించినా చివరికి సాదాసీదాగా టీఆర్‌ఎస్‌లోకి చేరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement