ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఓటుకు కోట్లు అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చింది.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఓటుకు కోట్లు అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చింది. కాగా శాసనసభ,మండలి వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. అయితే రాష్ట్రంలో ఒక పక్క కరువు, రైతుల ఆత్మహత్యల వంటి ప్రధాన సమస్యలు, మరోపక్క ప్రభుత్వ నిర్వాకంతో గోదావరి పుష్కరాల్లో 30 మంది మృతి చెందడం, పట్టిసీమలో మోసాలు లాంటి పలు కీలకాంశాలు అసెంబ్లీలో చర్చకు రాకుండా ప్రభుత్వం వర్షాకాల సమావేశాలను కేవలం ఐదు రోజులతో ముగించేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష పార్టీ సమావేశాలను పొడిగించాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం మాత్రం అంగీకరించలేదు. దీంతో నేటితో ఏపీ అసెంబ్లీ ముగియనుంది.