కొడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన బెయిల్ ఆంక్షలను హైకోర్టు సడలించింది. రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ సహా దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చని న్యాయస్థానం మంగళవారం ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రతి సోమవారం సాయంత్రం ఆయన ఏసీబీ కార్యాలయానికి విధిగా హాజరై సంతకం చేయాలని హైకోర్టు ఆదేశించింది. కాగా ఓటుకు కోట్లు కేసులో ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు డబ్బులు ఇస్తూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఈ కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు ...ఆయన తన సొంత నియోజకవర్గంలోనే ఉండాలని షరతులు విధించింది. దాంతో బెయిల్ వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అయ్యారు.
Published Tue, Sep 8 2015 11:34 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
Advertisement