'టీడీపీని వీడను, కేసీఆర్ను వదలను' | TDP mla revanth reddy slams telangana cm kcr | Sakshi
Sakshi News home page

'టీడీపీని వీడను, కేసీఆర్ను వదలను'

Published Fri, Aug 14 2015 11:56 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

'టీడీపీని వీడను, కేసీఆర్ను వదలను' - Sakshi

'టీడీపీని వీడను, కేసీఆర్ను వదలను'

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం తనను కుట్ర పూరితంగా ఓటుకు కోట్లు కేసులో ఇరికించిందని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.  ఈ కేసులో చార్జిషీటు దాఖలైన తర్వాత విచారణలో ప్రభుత్వ కుట్రలు బయటకు వస్తాయని ఆయన అన్నారు. ఓటుకు కోట్లు కేసులో శుక్రవారం రేవంత్ రెడ్డి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ను గద్దె దించేంతవరకూ తన పోరాటం కొనసాగుతుందని, టీడీపీని వీడేది లేదని స్పష్టం చేశారు.

 

మరో 25 ఏళ్లు కొడంగల్ నియోజకవర్గం నుంచి తానే గెలుస్తానని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నాయకులను, కార్యకర్తలను సమన్వయపరిచి ముందుకు సాగుతానని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై అసెంబ్లీ సమావేశాల్లో టీఆర్ఎస్ సర్కార్ తీరును ఎండగడతానని ఆయన ధ్వజమెత్తారు.  అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం టీఆర్ఎస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సదారాం నియామకంపై నిబంధనలకు విరుద్ధమని, హైకోర్టును ఆశ్రయిస్తానని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement