
ముందస్తుగానే సమాచారమిచ్చిన చంద్రబాబు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ అధికారుల బదిలీల నేపథ్యంలో విజయవాడ పోలీస్ కమిషనర్ వెంకటేశ్వరరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందస్తుగానే సమాచారం ఇచ్చారు. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా వెంకటేశ్వరరావు నియమితులయిన విషయం తెలిసిందే.
అయితే విజయవాడ సీపీ వెంకటేశ్వరరావు అమెరికా వెళ్లేందుకు ప్రయత్నాల్లో ఉండగా, వెళ్లవద్దని ఆయనకు చంద్రబాబు సూచించినట్లు సమాచారం. కాగా ఓటుకు కోట్లు కేసులో ముందస్తు సమాచారం లేకపోవటంపై చంద్రబాబు గుర్రుగా ఉన్నారు. ఇంత పక్కాగా పథకం వేసినా ఉప్పందించలేకపోయారని ఐపీఎస్ అధికారణి అనురాధపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆమెను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు డీజీగా బదిలీ చేశారు.