'తుందుర్రులో నియంత పాలన'
ఏలూరు: తుందుర్రులో నియంత పాలన సాగుతోందని వైఎస్సార్ సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని అన్నారు. భారత్-పాకిస్థాన్ సరిహద్దులోని లేని వాతావరణం తుందుర్రులో కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలోపు మెగా ఆక్వాఫుడ్ పార్క్ బాధిత గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలన్నారు.
వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు ఆదివారం సమావేశమయ్యారు. మోషేన్ రాజు, వంకా రవీంద్ర, గ్రంధి శ్రీనివాస్, తెల్లం బాలరాజు, కారుమూరి నాగేశ్వరరావు, ముదునూరి ప్రసాదరాజు, పుప్పాల వాసుబాబు, కొఠారు రామచంద్రరావు, కావూరు నివాస్, తలారి వెంకట్రావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.