తుందుర్రులో వైఎస్సార్సీపీ బృందం పర్యటన | ysrcp team visited in mega aqua food park villages | Sakshi
Sakshi News home page

తుందుర్రులో వైఎస్సార్సీపీ బృందం పర్యటన

Published Wed, Oct 5 2016 1:03 PM | Last Updated on Tue, May 29 2018 3:02 PM

తుందుర్రులో వైఎస్సార్సీపీ బృందం పర్యటన - Sakshi

తుందుర్రులో వైఎస్సార్సీపీ బృందం పర్యటన

భీమవరం : తుందుర్రు మెగా ఆక్వాఫుడ్ పార్క్ బాధితులకు అండగా ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు హామీ ఇచ్చారు. పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కొలుసు పార్థసారధి, మోపిదేవి వెంకటరమణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని నేతృత్వంలోని బృందం బుధవారం బాధిత గ్రామాల్లో పర్యటించింది.
 
మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న గ్రామస్తులను వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను నేతల దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాల్లో 144 సెక్షన్తో పాటు అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారని చెప్పారు. వృద్ధులు, మహిళలపైనా అక్రమ కేసులు బనాయిస్తున్నారని గ్రామస్తులు వాపోయారు. మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణంతో గ్రామాలు కాలుష్య బారిన పడుతున్నాయన్నారు. గత రెండున్నరేళ్లుగా చంద్రబాబు సర్కార్ అణచివేత ధోరణితో తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

ఫుడ్ పార్క్ బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని నేతలు హామీ ఇచ్చి...ధైర్యం చెప్పారు. బాధితులను పరామర్శించిన వారిలో నేతలు గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, పాతపాటి సర్రాజు, వంకా రవీంద్రనాథ్, గుణ్ణం నాగరాజు, కవురు శ్రీనివాస్, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు.   
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement