
కన్నతల్లిని చంపి పెంపుడు తల్లిని తెస్తారా?
- మూడు పంచాయతీల నుంచి వంద మీటర్ల దూరం కూడా లేకముందే ఫ్యాక్టరీ కడుతున్నారు
- నేను అడిగేది ఒక్కటే.. ఫ్యాక్టరీ ఇక్కడే కడుతున్నందువల్ల మనకు జరిగే నష్టం ఏంటి, అది ఎందుకు జరుగుతోందని మీరే చెప్పండి
- ఈ సమావేశం నుంచి మనం చంద్రబాబు నాయుడికి మెసేజ్ ఇద్దాం
- ప్రాజెక్టు మొదలుపెట్టడానికి ముందు ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు
- ప్రాజెక్టును వ్యతిరేకించినవాళ్ల మీద హత్యాయత్నం కేసులు కూడా పెట్టారు
- ఈ ఫ్యాక్టరీలో రోజుకు 3వేల టన్నుల రొయ్యలు, చేపలను శుద్ధి చేసినప్పుడు ఆ రసాయనాలతో కాలుష్యం రాకుండా ఎలా ఉంటుంది
- కాలుష్య నియంత్రణ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఆరంజ్ కేటగిరీలో ఉందని, ఇది కాలుష్య కారకమని చెబుతున్నారు
- మరోవైపు చంద్రబాబు మాత్రం ఈ ప్రాజెక్టు జీరో పొల్యూషన్ అని, దీని నుంచి కాలుష్యం రాదని అంటారు
- మరోవైపు సముద్రం వరకు పైపులైను కూడా వేస్తామని చెబుతారు
- కాలుష్యమే లేకపోతే మరి పైపులైను ఎందుకు వేస్తున్నారు?
- కాలుష్యం ఉందని మీకు తెలుసు కాబట్టే పైపులైను పేరుతో మీరు ప్రజలను మభ్యపెడుతున్నారు
- ఎన్నో సందర్భాల్లో మీరు ఎన్నో అబద్ధాలు ఆడారు
- ఎన్నికల సమయంలో రైతు రుణాలన్నింటినీ బేషరతుగా పూర్తిగా మాఫీ చేస్తామన్నావు
- బ్యాంకుల్లో పెట్టిన బంగారం బయటకు రావాలంటే బాబు సీఎం కావాలన్నావు
- డ్వాక్రా రుణాలు మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నావు
- ఇంటింటికీ జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని మభ్యపెట్టావు
- ఇప్పుడు పైపులైను వేస్తామని చెబుతున్నావు
- ఒక ప్రైవేటు సంస్థకు 20-25 కోట్ల ప్రభుత్వ సొమ్ముతో పైపులైను ఎందుకు వేస్తున్నావు?
- అంటే చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టు వల్ల ఏ స్థాయిలో ముడుపులు అందుకుంటున్నారో తెలుస్తుంది
- ప్రజలను మోసం చేయడానికి పైపులైను పేరుతో కొత్త డ్రామా ఆడుతున్నారు
- చంద్రబాబు గారూ.. పైపులైను డ్రామాలు ఆపండి
- పది కిలోమీటర్ల దూరానికి మారిస్తే.. అక్కడ మనుషులు ఉండరు, సముద్రతీరం ఉంది.
- అక్కడ ప్రభుత్వ భూములే 350 ఎకరాలు ఉన్నాయి. వాటిలో కొంత ఈ ఫ్యాక్టరీకి కేటాయిస్తే సముద్రతీరం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు
- పైగా దానివల్ల ఇన్ని కిలోమీటర్లు పైపులైను వేసేందుకు అయ్యే ఖర్చు కూడా తప్పుతుంది
- ఫ్యాక్టరీ వల్ల ఉద్యోగాలు కాస్త కూస్తో వస్తాయి కాబట్టి సరేనన్నామని కొందరు అంటున్నారు
- కానీ ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే.. విపరీతమైన దుర్గంధం వస్తుంది. కాలువలు కలుషితం అయిపోవడం వల్ల చేను ఏదీ బతకదు, పొలాల మీద ఆధారపడిన కూలీలు కూడా బతికే పరిస్థితి ఉండదు
- ఇదే ఫ్యాక్టరీని ఇక్కడినుంచి కేవలం 10 కిలోమీటర్లు తరలిస్తే, అందరూ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాం
- నిజంగా ఫ్యాక్టరీ వస్తే కొద్దోగొప్పో ఉద్యోగాలు వస్తాయి కాబట్టి పర్వాలేదు గానీ, ఇక్కడైతే వీళ్ల పొట్ట మీద కొట్టినట్లు అవుతుంది
- ఏదైనా ఫ్యాక్టరీ పెట్టాలంటే 50 ఏళ్ల వరకు దూరదృష్టితో చూడాలి
- ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత ఏ ఇబ్బంది ఉండకూడదని చూడాలి
- వీళ్ల లెక్కల ప్రకారం 15-20 కోట్ల పెట్టుబడులు పెట్టామంటున్నారు
- ఈ షెడ్లను ఇక్కడి నుంచి తీసుకుపోయి అక్కడ పెట్టుకోవచ్చు
- మహా అయితే పునాది పనులకు పెట్టిన ఐదు కోట్ల ఖర్చు మాత్రమే నష్టం కావచ్చు
- ఫ్యాక్టరీ స్థలం మొత్తం పూర్తిగా పోలీసులతో నింపేసి, అక్కడ యుద్ధ వాతావరణం సృష్టించారు. ఊళ్లో 144 సెక్షన్ పెట్టారు
- యాజమాన్యాన్ని కోరుతున్నా.. ప్రజల అభీష్టం మేరకు దీన్ని ఇక్కడినుంచి తరలించండి
- ఇక్కడ పబ్లిక్ హియరింగ్ జరగలేదు, ఫ్యాక్టరీ పెడతామని భూములు కొనలేదు, వీటన్నింటి నేపథ్యంలో పెద్ద మనసుతో ఆలోచించి ఇక్కడి నుంచి తరలించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం
- నీకు నిజంగా ఫ్యాషన్ అయిపోయింది. ప్రజలు ఒప్పుకోకపోయినా బలవంతంగా భూములు లాక్కుంటున్నావు
- మచిలీపట్నంలో 30 వేల ఎకరాలు బలవంతంగా లాక్కుంటున్నావు
- క్యాపిటల్ సిటీ అని పొలాలకు నిప్పు పెట్టించి మరీ లాక్కున్నావు
- భోగాపురం ఎయిర్‌పోర్టు కోసం అని బలవంతంగా భూములు లాక్కుంటున్నావు
- ఈ కార్యక్రమాలను ఎవరైనా ఎదిరిస్తే.. మేం అభివృద్ధి నిరోధకులం అని ముద్ర వేస్తున్నావు
- ప్రజలను విశ్వాసంలోకి తీసుకుని, వారి ఆమోదం తీసుకుని పనిచేయాలి అంతేతప్ప ఇలా నువ్వు చేస్తున్న దౌర్జన్యాలు తగవు
- హత్యాయత్నం కేసులు పెట్టి అరెస్టులు, గ్రామాల్లో 144 సెక్షన్లు మానుకో
- రాష్ట్రం కోసం కొద్దో గొప్పో పనిచేయడం నేర్చుకో అని చెబుతున్నా
- కోర్టులకు వెళ్లి ఈ ఫ్యాక్టరీ మీద కేసులు వేసి ఇక్కడి బాధితులకు అండగా ఉంటాం
- చంద్రబాబు పాలన ఇక కేవలం రెండేళ్లు మాత్రమేనని గుర్తుపెట్టుకోండి
- ఆ తర్వాత వచ్చేది మన ప్రభుత్వమేనని కచ్చితంగా చెబుతున్నా
- అప్పుడు ప్రజల అభీష్టం మేరకు ఏం కావాలో అది మాత్రమే చేస్తాం
- అలా కాదని చేస్తే చంద్రబాబు నాయుడు బంగాళాఖాతంలో కలిసే రోజొస్తుంది, ఈ ఫ్యాక్టరీ కూడా బంగాళాఖాతంలో కలుస్తుంది
- సీపీఎం మధు ఇక్కడకు వస్తే ఆయనను బలవంతంగా జైల్లో పెట్టారు
- ఆయన కోసం గ్రంధి శ్రీనివాస్ ధర్నా చేస్తే.. అప్పుడు వదిలిపెట్టారు
- వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెట్టి, పోలీసులను ఉపయోగించి అణిచేస్తారు
- ఇలాగే అయితే ఈ ప్రభుత్వం ఎల్లకాలం సాగదని చెబుతున్నా
- ఆళ్ల నాని, గ్రంధి శ్రీనివాస్, ప్రసాదరాజు అందరూ మీతోపాటు ఉండి అండగా, తోడుగా ఉంటారు
- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆక్వా ఫ్యాక్టరీ బాధితులకు అండదండలు అందిస్తుంది.