
'తుందుర్రులో 144 సెక్షన్ ఎత్తివేయాలి'
ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ...తుందుర్రులో వెంటనే 144 సెక్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతల ప్రోద్భలంతోనే పోలీసులు అరాచకాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, పార్టీ ముఖ్యనేతలు వంకా రవీందర్, దండి శ్రీనివాస్, పాతపాటి సర్రాజు, కొయ్యే మోషేన్రాజు, గున్నం నాగరాజు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.