భీమవరంలో ఉద్రిక్తత...మధు అరెస్ట్
పశ్చిమ గోదావరి : భీమవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేయనున్న మెగా ఆక్వాఫుడ్ పార్క్ను సందర్శించేందుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు శనివారం ఇక్కడకు చేరుకున్నారు.
వన్టౌన్ పోలీసులు ఫుడ్పార్క్ వద్దకు చేరుకుని మధును అడ్డుకున్నారు. అనంతరం ఆయన్ను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. దీంతో స్థానికంగా టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గ్రంధి శ్రీనివాస్, కార్యకర్తలతో కలిసి స్టేషన్కు చేరుకున్నారు. సీపీఎం మధును విడుదల చేయకపోతే స్టేషన్ వద్ద ధర్నా చేస్తామని గ్రంధి శ్రీనివాస్ హెచ్చరించారు.