సీపీఎం నేత మధుకు వైఎస్ జగన్ ఫోన్ | ys jagan mohan reddy phone call to cpm leader madhu over bhimavaram issue | Sakshi
Sakshi News home page

సీపీఎం నేత మధుకు వైఎస్ జగన్ ఫోన్

Published Sun, Oct 2 2016 1:01 PM | Last Updated on Mon, Aug 13 2018 9:04 PM

సీపీఎం నేత మధుకు వైఎస్ జగన్ ఫోన్ - Sakshi

సీపీఎం నేత మధుకు వైఎస్ జగన్ ఫోన్

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం ఫోన్లో మాట్లాడారు. శనివారం భీమవరంలో జరిగిన పరిణామాలపై వైఎస్ జగన్ ఆరా తీశారు. మధుతో పాటు సీపీఎం కార్యకర్తలపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఆయన ఆక్షేపించారు.

మెగా ఆక్వాఫుడ్ పార్క్ సందర్శించేందుకు శనివారం భీమవరం వెళ్లిన మధుతో పాటు సీపీఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించిన విషయం తెలిసిందే. (చదవండి : ఆక్వాపార్క్‌ రగడ )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement