
భయంతో బతకకూడదు: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: పారిశ్రామికాభివృద్ధికి జనసేన పెద్దపీట వేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. అభివృద్ధి కారణంగా ప్రజలు పురోగతి చెందాలేగానీ, భయంతో బతకకూడదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా మెగా ఆక్వాఫుడ్ పార్క్ బాధిత గ్రామాల ప్రజలు బుధవారం పవన్ కళ్యాణ్ ను కలిశారు. మెగా ఆక్వాఫుడ్ పార్క్ వల్ల 30 గ్రామాలు తీవ్ర కాలుష్యానికి గురవుతాయని పవన్ కు బాధిత గ్రామాల ప్రజలు వివరించారు.
సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడతానని వారికి పవన్ హామీయిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి ఎంత ముఖ్యమో, ప్రజల బాధలు కూడా అంతే ముఖ్యమని అన్నారు.