
గన్నవరం విమానాశ్రయం చేరుకున్న వైఎస్ జగన్
గన్నవరం : ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో పశ్చిమ గోదావరి జిల్లా బయల్దేరతారు. జిల్లాలో ప్రతిపాదిన మెగా ఆక్వాఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు, మత్య్సకారులకు సంఘీభావం తెలిపేందుకు ఆయన ఈవాళ భీమవరంలో పర్యటించనున్నారు.
అలాగే తణుకు సబ్ జైల్లో ఉన్న ఆక్వా బాధితులను పరామర్శిస్తారు. గన్నవరంలో పార్టీ నేతలతో కొద్దిసేపు మాట్లాడిన అనంతరం వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లాకు పయనం అవుతారు. అక్కడ మెగా ఆక్వాఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు, మత్య్సకారులతో ముఖాముఖీ నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం గన్నవరం విమానాశ్రయం చేరుకుని హైదరాబాద్ బయల్దేరి వెళతారు.