వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 19న పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రు గ్రామానికి వస్తున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని శనివారం తెలిపారు. భీమవరం, మొగల్తూరు మండలాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తారని పేర్కొన్నారు. గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా తుందుర్రు, పరిసర గ్రామాల ప్రజలు రెండేళ్లుగా ఉద్యమిస్తున్న విషయం విదితమే. అయితే, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చేపట్టింది.