వైఎస్ జగన్‌ను కలిసిన ఆక్వా ఫుడ్‌పార్క్ బాధితులు
హైదరాబాద్: తుందుర్రు మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధితులు బుధవారం వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. సత్యవతి నేతృత్వంలో వైఎస్ జగన్‌ను కలిసిన ఆక్వాఫుడ్ పార్క్ బాధితులు.. తమ పోరాటానికి మద్దతు పలికినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తుందుర్రు ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా.. బాధితులకు పూర్తి స్థాయిలో అండదండలు అందిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వెళ్లి.. బలవంతంగా ఫుడ్‌పార్క్ నిర్మాణం చేపట్టవద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.