రాజకీయ లబ్ధి కోసం విభజన తగదు | state division for political benefit Meka Seshu Babu, MLC | Sakshi
Sakshi News home page

రాజకీయ లబ్ధి కోసం విభజన తగదు

Published Mon, Nov 4 2013 1:10 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

state division for political benefit Meka Seshu Babu, MLC

పాలకొల్లు, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర విభజనకు పూనుకోవడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్‌లో నాన్‌పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలు ఆదివారం 95వ రోజుకు చేరాయి. దీక్షాపరులకు శేషుబాబు సంఘీభావం తెలిపి మాట్లాడారు. దీపావళి పర్వాదినాన్న కూడా దీక్షలు నిర్వహించడం చూస్తుంటే సమైక్యాంధ్రపై సీమాంధ్రుల ఆకాంక్ష తెలుస్తుందన్నారు. 
 
 సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కల్లబొల్లి కబుర్లు కట్టిపెట్టి ఉద్యమ తీవ్రతను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.  విభజన ప్రక్రియ ఆపకపోతే ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. విభజనకు కారకులైనవారి దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. వైసీపీ శ్రేణులు గుణ్ణం నాగబాబు, ముచ్చర్ల శ్రీరామ్, యడ్ల తాతాజీ, ఎం.మైఖేల్‌రాజు, చీకట్ల వరహాలు, కె. రామచంద్రరావు, సీహెచ్ సత్తిబాబు, జె.లక్ష్మీనారాయణ, జి.రాంబాబు, మద్దా చంద్రకళ, బి.గంగాధరరావు, ఆర్.మీరయ్య, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement