`మద్యపాన నిషేధాన్ని తుంగలోకి తొక్కింది చంద్రబాబే`
పాలకొల్లు: మద్యపాన నిషేధాన్ని తుంగలోకి తొక్కి.. సంపూర్ణంగా అమలుచేసిందే చంద్రబాబు నాయడుని పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మేకాశేషుబాబు వ్యాఖ్యానించారు. ఈ రోజు బెల్ట్ షాపులు నిషేధం కోసం చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబుకు అలా మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఘాటుగా విమర్శించారు.
కాగా, గతంలో ఎన్టీఆర్ సంపూర్ణ మద్యపాన నిషేధం తెస్తే.. చంద్రబాబు హయాంలో నిషేధం ఎత్తేసిన సంగతి తెలిసిందే. అంతేకాక, టీడీపీ అధికారంలోకొస్తే సరసమైన ధరలకే చంద్రబాబు మద్యాన్ని అందిస్తానన్నారు. ఇప్పుడు ఆయనే తనకు అధికారమిస్తే.. ‘బెల్టు’ షాపులను నిషేధిస్తానంటున్నారు.