పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుణ్ణం నాగబాబు వెనక్కు తగ్గారు.
పాలకొల్లు: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుణ్ణం నాగబాబు వెనక్కు తగ్గారు. తన నామినేషన్ పసంహరించుకున్నారు. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి మేకా శేషుబాబుకు మద్దతిస్తానని నాగబాబు ప్రకటించారు. నాగబాబు నిర్ణయం పట్ల వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
మరోవైపు టీడీపీ రెబల్గా బరిలోకి దిగిన డాక్టర్ సీహెచ్ సత్యనారాయణమూర్తి(బాబ్జీ) పట్టువీడలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్లో మాట్లాడినా ఆయన వెనక్కు తగ్గలేదు. పాలకొల్లు టీడీపీ టిక్కెట్ నిమ్మల రామానాయుడికి ఇవ్వడంతో బాబ్జీ రెబల్గా నామినేషన్ వేశారు. కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకే నామినేషన్ వేసినట్టు బాబ్జీ తెలిపారు.