కాంగ్రెస్ లో అసమర్ధ నాయకత్వం: కావూరి
ఏలూరు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కావూరి సాంబశివరావు పార్టీ మారేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ కు గడ్డు పరిస్థితి కనిపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీని వీడే ఆలోచనలలో కావూరి ఉన్నట్టు తెలుస్తోంది. కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ మారేందుకు అభిప్రాయాల్ని సేకరిస్తున్నారు. తన నియోజకవర్గంలోని కార్యకర్తల అభిప్రాయాల ప్రకారమే తాను ఓ నిర్ణయం తీసుకుంటానని కావూరి అన్నారు.
ఆ క్రమంలోనే వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నాని కావూరి అన్నారు. కార్యకర్తలు ఒప్పుకుంటే కాంగ్రెస్ నుంచి బయటకు వస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీలో సమర్ధవంతమైన నాయకుడు లేడని.. పార్టీ అసమర్థ నాయకత్వం ఉందని కావూరి ధ్వజమెత్తారు. మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు తెలుగుదేశం పార్టీలో చేరుతారనే వార్తలు ఏలూరు నియోజకవర్గంలో జోరందుకున్నాయి.