ఈ మేరకు స్పీకర్‌కు లేఖ రాస్తాం.. వెల్‌లోకి వెళతాం.. ప్రతిఘటిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: సహచర సీమాంధ్ర ఎంపీలపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివే యాలని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు డిమాండ్ చేశారు. సోమవారం స్పీకర్ మీరాకుమార్‌కు లేఖ ద్వారా ఈ మేరకు విజ్ఞప్తి చేయనున్నట్టు తెలిపారు. ‘ఎవరికి చెప్పుకున్నా వినలేని పరిస్థితుల్లోనే వెల్‌లోకి వెళ్లాలనుకున్నాం. సోమవారం వెళతాం. ఆ తర్వాతా వెళతాం. ప్రతిఘటన తప్పదు..’ అని అన్నారు. ఆదివారం రాత్రి కావూరి నివాసంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు సమావేశమయ్యారు. వివిధ అంశాలపై 3 గంటలపాటు చ ర్చించారు. అనంతరం కావూరి మీడియాతో మాట్లాడారు. ‘అసలు హింసాత్మక పద్ధతులకు ఎవరు పాల్పడ్డారు. వీడియో దృశ్యాలు చూడాలి. అప్పుడు చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సభ్యులను బయటకు పంపి రాష్ట్రాన్ని విభజించడాన్ని చరిత్ర క్షమించదు. మా సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి.
సభలోకి రావడానికి అనుమతించాలని స్పీకర్ గారిని అడగబోతున్నాం. దీనికి కాంగ్రెస్, ప్రతిపక్షాల నేతలు కూడా సహకరిస్తారని నమ్ముతున్నాం. ప్రధాని, సోనియా, జీఓఎంకు చెప్పినా.. అసెంబ్లీ తిప్పిపంపినా వినకుండా విభజిస్తే దేశం ఎలా ముక్కలవుతుందో చెప్పదలుచుకున్నాం. కేబినెట్‌లో చర్చించినా మా అభిప్రాయాలకు విలువ లేకపోతే ఎలా? పార్లమెంటులో అన్ని పార్టీల సభ్యులు పరిస్థితిని అర్థం చేసుకుని పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తారని భావిస్తున్నాం..’ అని చెప్పారు. ‘బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో నేను కూడా ఉన్నా. సంప్రదాయమేంటి. సవరించిన జాబితాలో పెట్టొచ్చు. అర్జంట్ అయితే సప్లిమెంటరీ ఎజెండాను సభ్యులకు పంచిపెడతారు. సభ్యులు అడ్డుచెబితే సభ అభిప్రాయం తీసుకుని.. సభా సంప్రదాయం మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. కానీ గొడవలో ఎవరు ఏంచేస్తున్నారో తెలియని పరిస్థితిలో బిల్లును తెచ్చినట్టు చెప్పడం సబబు కాదు..’ అని పేర్కొన్నారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు చిరంజీవి, పురందేశ్వరి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, జేడీ శీలం.. ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, మాగుంట, బాపిరాజు, సారుుప్రతాప్, సబ్బం హరి, లగడపాటి, ఉండవల్లి, కేవీపీ, హర్షకుమార్‌లు పాల్గొన్నారు.
ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలి: కావూరి
Published Mon, Feb 17 2014 2:09 AM | Last Updated on Wed, Aug 15 2018 7:45 PM
Advertisement
Advertisement