కేంద్రమంత్రిగా ఉంటే ప్రజల వాదన వినిపించకూడదా?
న్యూఢిల్లీ : సీమాంధ్ర ప్రజల వాదనను వినిపించేందుకే స్పీకర్ వెల్లోకి దూసుకు వెళ్లినట్లు కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని డిమాండ్ చేశారు. కేబినెట్లో టేబుల్ ఐటంగా తీసుకు వచ్చినప్పుడే తెలంగాణ బిల్లుపై అభ్యంతరం తెలిపానని కావూరి ఈ సందర్భంగా గుర్తు చేశారు. మంత్రిగా ఉంటే ప్రజల వాదన వినిపించకూడదా అని ఆయన ప్రశ్నించారు. లోక్సభలో తొలిసారిగా సీమాంధ్ర కేంద్ర మంత్రులు వెల్ వద్దకు వెళ్లిన విషయం తెలిసిందే.