తెలంగాణ బిల్లు ఆమోదం పొందే సమస్యే లేదు: కావూరి | telangana bill will not get through, says kavuri sambasiva rao | Sakshi
Sakshi News home page

తెలంగాణ బిల్లు ఆమోదం పొందే సమస్యే లేదు: కావూరి

Published Fri, Feb 7 2014 11:50 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

తెలంగాణ బిల్లు ఆమోదం పొందే సమస్యే లేదు: కావూరి - Sakshi

తెలంగాణ బిల్లు ఆమోదం పొందే సమస్యే లేదు: కావూరి

తెలంగాణ బిల్లు ఈ సమావేశాల్లో ఆమోదం పొందే సమస్యే లేదని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ధీమా వ్యక్తం చేశారు. అందుకు తమ వ్యూహాలు తమకున్నాయని, తమ అస్త్రాలు, ఎత్తుగడలు అన్నీ సిద్ధంగానే ఉన్నాయని ఆయన చెప్పారు.

హైదరాబాద్ ను యూటీ చేయకపోతే కేంద్ర మంత్రివర్గ సమావేశం నుంచి వాకౌట్ చేస్తానని కావూరి అన్నారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయకపోతే ఇక సీమాంధ్రులకు ఏరకంగా ఉపయోగం ఉంటుందని ఆయన మండిపడ్డారు. అయితే హైదరాబాద్ నగరాన్ని నేరుగా యూటీ చేయకుండా, యూటీకి ఉండే లక్షణాలన్నీ దానికి కల్పిస్తామని జీవోఎం అంటే, అలా చేస్తే ఉపయోగం ఏమీ ఉండదని కావూరి వాదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement