విభజనపై న్యాయపోరాటం చేస్తాం:ఒవైసీ | we will fight back on bifurcation, says asaduddin owaisi | Sakshi
Sakshi News home page

విభజనపై న్యాయపోరాటం చేస్తాం:ఒవైసీ

Published Tue, Feb 18 2014 9:27 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

విభజనపై న్యాయపోరాటం చేస్తాం:ఒవైసీ - Sakshi

విభజనపై న్యాయపోరాటం చేస్తాం:ఒవైసీ

ఢిల్లీ: ఆంధ్రపునర్ వ్యవస్థీకరణ (తెలంగాణ) బిల్లు ఆమోదించిన తీరుపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. రాష్ట్ర విభజన జరిగిన తీరుపై న్యాయపోరాటానికి దిగుతామని ఒవైసీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన విభజన తీరు సవ్యమైన దిశలో జరగలేదన్నారు. విద్యార్థులు ప్రాణ త్యాగం చేసింది.. ఇలాంటి ఇలాంటి తెలంగాణ కోసమేనా? అని ప్రశ్నించారు.

హైదరాబాద్ నగరంపై గవర్నర్‌కు సూపర్‌ అధికారాలు ఇవ్వడం ఏ ప్రజాస్వామ్యానికి నిదర్శనమని కేంద్రాన్ని నిలదీశారు. ఏపీ భవన్‌ నిజాం ఆస్తే, దాన్ని సీమాంధ్రకు ఎలా రాస్తారన్నారు. లోక్‌సభ ప్రసారాలను ఎందుకు నిలిపేశారో జాతికి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement