
రాజీనామాకు సిద్ధం : కావూరి
తిరుమల : సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీ ఎన్జీవోలు చేపట్టిన ఉద్యమానికి సానుకూల నిర్ణయం రాకుంటే రాజీనామాకు సిద్ధమని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు స్పష్టం చేశారు. ఏపీ ఎన్జీవోలు ఉద్యమం చేయటం సమంజసమేనని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం కావూరి కలియుగ వైకుంఠ దైవం శ్రీనివాసుడిని దర్శించుకున్నారు.
దర్శనం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర విభజన విజయంలో అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని కావూరి అన్నారు. సీమాంధ్ర ఉద్యమ తీవ్రతను సోనియాగాంధీ, ఆంటోనీ కమిటీకి వివరించినట్లు ఆయన తెలిపారు. కాగా రాష్ట్ర విభజన ప్రకటనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర జిల్లాల్లో 24వ రోజు కూడా నిరసనలు, ఆందోళనలు, దీక్షలు కొనసాగుతున్నాయి.