
కావూరి కంపెనీపై చర్యలకు ఎస్‌బీఐ సిద్ధం!
ముంబయి : కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు కంపెనీపై చర్యలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధమంటూ మింట్ పత్రికలో ఒక వార్తా కథనం వెలువరించింది. ప్రోగెస్సివ్ కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్ కంపెనీలో పేరుతో తీసుకున్న మొండి బకాయిలు చెల్లించకపోవడంపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రోగెస్సివ్ కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్ కంపెనీ పేరిట రుణం తీసుకోగా, రూ.350 కోట్లు ఎస్బీఐకి బకాయిపడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ కంపెనీలో కావూరి సాంబశివరావుకు 41 శాతం వాటా ఉంది. ఇప్పటికే ప్రోగెస్సివ్ కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్ కంపెనీ బకాయిలపై ఈసీకి బ్యాంకర్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. ఈకంపెనీ ఆంధ్రా బ్యాంకు నుంచి రూ.49కోట్లు, కార్పోరేషన్ బ్యాంకు నుంచి రూ.47కోట్లు, అలహాబాద్ బ్యాంకు నుంచి రూ.42కోట్లు అప్పు తీసుకున్నట్లు బ్యాంకర్స్ అసోసియేషన్ ఆరోపించింది.