కేబినెట్ లో కావూరి, సీమాంధ్ర మంత్రులకు చుక్కెదురు!
కేంద్ర మంత్రివర్గ సమావేశంలో సీమాంధ్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పళ్లంరాజులు చేసిన ప్రయత్నాలకు బెడిసికొట్టాయి.
అసెంబ్లీ చర్చించిన బిల్లునే యథాతథంగా కేబినెట్ ముందుకు తీసుకువెళ్లారు. బిల్లును కేబినెట్‌కు మంత్రివర్గ సభ్యులు చిదంబరం, జైరాంరమేష్‌లు వివరించారు. రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని కావూరి చేసిన ప్రతిపాదనను కేబినెట్ తోసిపుచ్చింది.
అయితే కనీసం హైదరాబాద్‌ను యూటీ చేయాలని ముగ్గురు సీమాంధ్ర మంత్రులు చేసిన విజ్క్షప్తికి కేబినెట్ నిరాకరించింది. సీమాంధ్ర మంత్రులు చేసిన ప్రతిపాదనలను, విజ్క్షప్తులను కుదరదని కేబినెట్ తోసిపుచ్చినట్టు సమాచారం.
బిల్లుకు సంబంధించి...మొత్తం 30 నుంచి 40 సవరణలు ఉన్నాయని తెలుస్తోంది. సవరణలను అధికారికంగా కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, కొత్త రాజధానికి సంబంధించి అన్ని అనుమతులనూ బిల్లు ద్వారా ఓకే కేంద్రం చేసే అవకాశం ఉంది.
కేబినెట్ ఆమోదించిన మరికొన్ని అంశాలు:
-
10 ఏళ్లపాటు సీమాంధ్ర-తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్
-
గవర్నర్ చేతికి హైదరాబాద్ శాంతి భద్రతలు
-
షెడ్యూల్ ప్రకారమే 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరపాలనే యోచన
-
పోలవరం ముంపు గ్రామాలు సీమాంధ్రకే
-
సీమాంధ్ర కొత్త రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్రానిదే
-
కొత్త రాజధానికి ఎంత ప్యాకేజీ ఇవ్వాలనేదానిపై పార్లమెంట్‌లో నిర్ణయం
-
సీమాంధ్ర పన్ను రాయితీ ప్రకటించిన కేంద్రం