కవిటి: రాష్ట్రంలో రాజ్యాంగంతో పనిలేని ప్రభుత్వం పాలన సాగిస్తోందని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షులు తమ్మినేని సీతా రాం ఆరోపించారు. శనివారం మండలంలోని బల్లిపుట్టుగలో ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేని స్థితిలో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు నమ్మక ద్రోహం చేశారని విమర్శించా రు. రుణమాఫీ పేరిట చంద్రబాబు మభ్యపెట్టి ఓట్లు దొంగలించుకున్న తీరు దౌర్భాగ్యకరమన్నారు. 2009లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వం వద్ద తనకున్న పలుకుబడితో రుణమాఫీ చేసి అన్నదాత హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న తీరు నేటికీ ప్రజలు మరవలేరన్నారు.
పోలవరానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జాతీయ ప్రాజెక్ట్ హోదా వచ్చిందని ఇటీవల చంద్రబాబు సైతం అంగీకరించడం ప్రజలు గుర్తించాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా మాత్రమే ఉద్యోగాల కల్పనకు అవకాశం కల్పించనుందన్న సత్యాన్ని జగన్‌మోహన్‌రెడ్డి విభజన సమయం నుంచే నొక్కిచెబుతున్న విషయం ప్రజలకు తెలుసన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాలి ప్రబలంగా వీస్తోందని తమ్మినేని అ న్నారు. సమావేశంలో సమన్వయకర్త పిరియా సాయిరాజ్, వైఎస్సార్‌సీపీ నేతలు కంచిలి ఎం పీపీ ప్రతినిధి ఇప్పిలి కృష్ణారావు, శ్యాంపురియా, రజనీకుమార్ దొళాయి, బి.నాగభూషణంరెడ్డి, తడక జోగారావు, మడ్డు రాజారావు, జె.యుగంధర్, ఎం.బుద్దేశు, గుమ్మడి రాందా స్, విశ్వనాథం, వై.నీలయ్య, కర్రి జగదీష్, పాపారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment