
'ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్టానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదని బీజేపీ నేత కావూరి సాంబశివరావు చెప్పారు. బుధవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.
14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా కుదరదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరుగుతుందని కావూరి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిందని కావూరి విమర్శించారు.