
'మీకు పదవే ముఖ్యమనుకుంటే రాజకీయ సమాధే'
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో జరిగిన రైతు గర్జన సభలో కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుపై అశోక్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో జరిగిన రైతు గర్జన సభలో కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుపై అశోక్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెండు నెలల్లో ముగిసిపోయే పదవి కోసం పాకులాడుతూ ప్రజల్ని మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పదవే ముఖ్యమనుకుంటే రాజకీయ సమాధేనని తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతివ్వని సీమాంధ్ర ఎమ్మెల్యేలను సాంఘిక బహిష్కరణ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మంత్రులు ఈ తరహాలో ఉండి వైఖరి మార్చుకోకపోతే ఉద్యమ తీవ్రతను చూపిస్తామంటూ కాంగ్రెస్ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు.
అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్రకు చెందిన ఏ ఒక్క ప్రజాప్రతినిధి అయిన విభజన బిల్లుకు సహకరిస్తే వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండి చేస్తామన్నారు. మంత్రులు కోట్లు ఖర్చు పెట్టి మళ్లీ గెలవాలనుకుంటే అది వారి పిచ్చితనమే అవుతుందన్నారు. సమైక్యాంధ్ర కోరుకునే వారిని గెలిపించి సీమాంధ్రుల భవిష్యత్తు అంధకారం కాకుండా చూడాలన్నారు.