భారీ వర్షాల వల్ల సంభవించిన అపార నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం నుంచి జిల్లాకు నిధులు విడుదల చేయించాలని కలెక్టర్ సిద్ధార్థజైన్
కేంద్రం నుంచి నిధులు ఇప్పించండి
Published Wed, Oct 30 2013 2:40 AM | Last Updated on Thu, Mar 21 2019 8:19 PM
ఏలూరు, న్యూస్‌లైన్ : భారీ వర్షాల వల్ల సంభవించిన అపార నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం నుంచి జిల్లాకు నిధులు విడుదల చేయించాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావును కోరారు. ఏలూరులోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో మంగళవారం మధ్యాహ్నం ఆయన కేంద్ర మంత్రిని కలిసి జిల్లాలో నష్టం వివరాలను తెలియజేశారు. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు. మూడు నెలల్లో వరదలు, తుపానులు, భారీ వర్షాలవల్ల రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని, వాటిని వెంటనే బాగు చేసేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించాలని కోరారు. నష్టం తీవ్రతను తగ్గించేందుకు జిల్లా యంత్రాంగం చేపట్టిన ముం దస్తు చర్యలను అడిగి తెలుసుకున్న మంత్రి కలెక్టర్‌ను ప్రశంసించారు. పలువురు జిల్లా అధికారులతో ఆయన చర్చించారు. బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఏలూరు ఆర్డీవో శ్రీనివాసరావు, ఏలూరు సీఐలు నక్కా సూర్యచంద్రరావు, రవికుమార్, విజయపాల్ తదితరులు కావూరిని కలిశారు.
కేంద్ర నిధులు తీసుకు వస్తా : మంత్రి కావూరి
జిల్లాలో భారీ వర్షాల వల్ల రూ.784కోట్ల నష్టం వాటిల్లిం దని కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు చెప్పారు. నష్టపోయిన ైరె తులు, ప్రజలను ఆదుకోవడానికి కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఏలూరు కలెక్టరేట్‌లో పంట, ఆస్తి నష్టాలపై మంత్రి మంగళవారం రాత్రి సమీక్షించారు. వర్షాలు, వరదలు తాకిడికి ఇళ్లు కోల్పోయిన పేదలకు శాశ్వత గృహనిర్మాణ పథకంలో ఇళ్లు కట్టించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో వరదల నివారణకు శాస్త్రీయ సమగ్ర ప్రణాళిక రూపొందించాలని, అవసరమైన నిధులను కేంద్రం నుంచి తీసుకువస్తానని కావూరి హామీ ఇచ్చారు. కలెక్టర్ సిద్ధార్థజైన్ మాట్లాడుతూ మెట్ట ప్రాంతంలో రెండు రోజుల్లో పంట నష్టం అంచనాలను ప్రారంభించి నాలుగు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు.
పంట నష్టం పరిశీలన
కొవ్వలి(దెందులూరు), న్యూస్‌లైన్ : భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మంగళవారం పర్యటించారు. దెందులూరు మండలం కొవ్వలి, దోసపాడు, పోతునూరు గ్రామాల్లో ఆయన పర్యటించారు. కొవ్వలి మొండికోడు వద్ద మునిగిపోయిన పంట పొలాల్లో వచ్చిన మొలకలను పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల కోరికమేరకు నీలం తుపాను నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. దోసపాడు వాగు వల్ల పంట నష్టానికి గురవుతోందని గ్రామస్తులు మంత్రికి తెలిపారు. పోతునూరులో డ్రె యిన్ల ఆధునీకరణ, పూర్తి స్థాయి రోడ్ల నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరారు. పంట నష్టం జరిగిన ప్రతి రైతుకు వెంటనే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కాటన్ ఎడ్వైజరీ బోర్డు డెరైక్టర్ కొత్త సాం బశివరావు, పోతునూరు సర్పంచ్ జక్కుల దాసు కేంద్ర మంత్రికి వినతిపత్రం అందచేశారు.
Advertisement
Advertisement