
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కార్ 2014లో అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్) ద్వారా కేంద్రానికి రూ.4.04 లక్షల కోట్లు వచ్చాయి. 59 సంస్థల్లో ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో వాటాల విక్రయంతో అత్యధికంగా రూ.1.07 లక్షల కోట్లు ఖజానాకు సమకూరినట్లు ఆర్థిక శాఖ మంగళవారం వెల్లడించింది.
ఎయిరిండియాతో పాటు 10 కంపెనీల్లో వాటాల విక్రయంతో గత 8 ఏళ్లలో ప్రభుత్వానికి రూ. 69,412 కోట్లు వచ్చాయి. 45 కేసుల్లో షేర్ల బైబ్యాక్ కింద రూ.45,104 కోట్లు లభించాయి. 2014–15 మధ్య 17 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు లిస్టయ్యాయి. వీటితో కేంద్రానికి రూ.50,386 కోట్లు వచ్చాయి. వీటిలో ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ ద్వారా అత్యధికంగా రూ. 20,516 కోట్లు లభించాయి. అటు పారదీప్ ఫాస్ఫేట్, ఐపీసీఎల్, టాటా కమ్యూనికేషన్స్‌లో తనకు మిగిలి ఉన్న వాటాలను కేంద్రం మొత్తం రూ. 9,538 కోట్లకు విక్రయించింది.
చదవండి: కేంద్రం సంచలన నిర్ణయం..! ఆ కార్ల తయారీ నిలిపివేత?
Comments
Please login to add a commentAdd a comment